ప్ర‌త్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని పోరాటం

హోదా హోరుఅమ‌రావ‌తి:  ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం ఆది నుంచి కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో ఎంపీల దీక్షలకు మద్దతుగా ప్రారంభమైన ఆందోళనలు...శుక్ర‌వారం ఏడో రోజు కొనసాగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినదించారు. హోదా సాధనే ధ్యేయంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు పాల్గొని  ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు.   రిలే నిరాహార దీక్షలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  సంఘీభావం తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.  నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదని కారు కూతలు కూసిన చంద్రబాబు, నేడు హోదా కావాలని తన ఎంపీలతో నాటకాలు వేయిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేర‌ని నాయ‌కులు మండిప‌డుతున్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే  హోదా కోసం తమ ఎంపీలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం చరిత్రాత్మకం. 
Back to Top