హంద్రీనీవా నీరు విడుదల చేయండి

గోరెంట్లలో శంకర్‌నారాయణ బైక్‌ ర్యాలీ

అనంతపురం: రాష్ట్రం వ్యవసాయంతో సుభిక్షంగా ఉండాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు రూపొందించారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత శంకర్‌నారాయణ గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అనంపురం జిల్లా గోరెంట్ల మండలానికి హంద్రీనీవా ద్వారా తాగు, సాగు నీరు అందివ్వాలని డిమాండ్‌ చేస్తూ శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అనే ధోరణితో సాగునీరు అందివ్వడం లేదన్నారు. బైక్‌ ర్యాలీలో హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Back to Top