అసెంబ్లీలో రాజీనామాకు సిద్ధమా..?

యరపతినేని శ్రీనివాసరావు ముమ్మాటికి అవినీతికి పాల్పడ్డారు
అవినీతిని నిరూపిస్తానన్న భయంతోనే తనను హౌజ్ అరెస్ట్ చేశారు
దమ్ముంటే యరపతినేని గురజాలలో తనపై గెలవాలని సవాల్

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు.  దమ్ముంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజీనామాకు సిద్ధపడాలని సవాల్ చేశారు.  మాచర్లలో పిన్నెల్లి  మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల పనుల్లో యరపతినేని ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటే..తనను హౌస్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. గురజాలలో యరపతినేనిపై తాను పోటీ చేస్తానని...ఎవరు ఓడిపోతే వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిన్నెల్లి చెప్పారు. యరపతినేని మైనింగ్లో అవినీతికి పాల్పడ్డారని లోకాయుక్త కూడా నిర్ధారించిందన్నారు.    
 
తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని పిన్నెల్లి స్పష్టం చేశారు. యరపతినేని నియోజకవర్గంలో దందాలు కొనసాగిస్తూ పేదలను పీక్కుతింటున్నారని మండిపడ్డారు. యరపతినేని అవినీతిని అడ్డుకుంటున్నానన్న అక్కసుతోనే ప్రభుత్వం తనపై కక్షగట్టి పోలీసులతో నిర్బంధించిందని పిన్నెల్లి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈఉదయం దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

యరపతినేని అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు పిన్నెల్లి  బయలుదేరడంతో టీడీపీ ఎమ్మెల్యేకు గుబులు పట్టుకుంది. దీంతో, పోలీసులను ఉసిగొల్పి అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. చర్చావేదికకు వెళ్లేందుకు యత్నించిన పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లికి చెందిన వైయ‌స్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో ఆదివారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top