ముడిపట్టు రాయితీ బకాయిలపై బహిరంగ చర్చకు సిద్దమా..?

ధర్మవరంటౌన్ః మూడేళ్ల టిడిపి పాలనలో ముడిపట్టు రాయితీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ చేనేత  వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైయస్ ఆర్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణాద్యక్షుడు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్‌ చందమూరి నారాయణరెడ్డిలు అన్నారు.  ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బకాయిలు చెల్లించాలని వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అందుకు చేనేతల నుండి వచ్చిన ఆదరణ చూసి టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైందని  ముడిపట్టురాయితీ బకాయిలపై బnహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్‌ విసిరారు. జిల్లాలో 60మందికి పైగా నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులలో చేనేత రంగం ఉంటే ఆదుకోకుండా 18 నెలల బకాయిలు పెండింగ్‌లో పెట్టారన్నారు. రూ.17కోట్ల నిధులు చేనేతలకు రావాల్సిన విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. చేనేతల ముడిపట్టు బకాయిలపై ధర్మవరంలోని నేతన్న విగ్రహం ఎదుటు ప్రజాబ్యాలెట్‌ పెడదామని బకాయిలు లేవని ప్రజలు తీర్పు చెబితే రాజకీయాల నుంచి  తప్పుకుంటామని, ఉన్నాయని చెపితే టిడిపి నాయకులు రాజకీయ సన్యాసం చేస్తారా..? అని సవాల్ చేశారు. రాయితీ బకాయిలు కార్మికులకు అందే వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. పార్టీ నాయకులు బీరే జయచంద్ర, గుర్రం రాజ, జింకా కంబగిరి, జింకా రాఘవేంద్ర, శివశంకర్, చింతా క్రిష్ణయ్య, వడ్డే బాలాజీ, కుమారస్వామి, పెద్దన్న, చింతా యల్లయ్య, దేవరకొండరమేష్, జెన్నే చందు, బెస్త వెంకటరమణ, చంద్రశేఖర్‌రెడ్డి, బుగ్గా నాగభూషణం, శివ తదితరులు పాల్గొన్నారు.

Back to Top