సోమిరెడ్డి అక్రమాలపై చర్చకు సిద్ధం

నెల్లూరు

: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణను పదవి నుంచి తొలగించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  నిత్యం మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై సోమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాలపై నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని కాకాని గోవర్థన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top