రాయలసీమకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు..!

అనంతపురంః రాష్ట్రప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని వైఎస్సార్సీపీ నేత అనంతవెంకట్రాంరెడ్డి ఫైరయ్యారు.  తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు తోడు దొంగల్లా కూడబలుక్కొని ...రాయలసీమకు గండికొట్టి తాగునీటి పేరుతో  తెలంగాణ,కోస్తాకు తరలిస్తున్నారని మండిపడ్డారు. వెనకబడిన ప్రాంతాల పట్ల వివక్ష చూపుతూ చంద్రబాబు సాగిస్తున్న పాలలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే రాయలసీమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందన్నారు.  

పరిశ్రమలు, నీళ్లు, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను మోసం చేస్తున్నారన్నారు. సోలార్ విద్యుత్ పేరుతో రాయలసీమలో వేల ఎకరాలు తీసుకొని కోస్తాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాయలసీమ పేరును వాడుకుంటూ చంద్రబాబు సీమకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. ప్రజాప్రతినిధులంతా మేల్కోవాలన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top