రాయ‌ల‌సీమ‌కు విద‌ర్భ త‌ర‌హా ప్యాకేజీ ఇవ్వాలి

* కరువు పరిస్థితులపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాయాలి
* రాయలసీమ నుంచి పక్క రాష్ట్రాలకు వలసలు నివారించాలి
* వాస్తవాలను దాచి గొప్పలు ప్రచారం చేయడం రాష్ట్రానికి మంచిది కాదు.. బాబు గ్రహించాలి
* వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి 

సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోడీకి లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యవసాయం సంక్షోభంతో రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లా కరువు కోరల్లో చిక్కుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 5 నుంచి కర్నూలు జిల్లాలో జరిగే రైతు భరోసా యాత్రలో పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆరు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించడంతోపాటు వారికి భరోసా ఇస్తారని నాగిరెడ్డి వివరించారు. రాయలసీమలో ఉపాధి దొరక్క రైతులంతా కుటుంబాలతో సహా  పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని ఇలాంటి పరిస్థితులు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

విదర్భా తరహా ప్యాకేజీ అడగండి
రాయలసీమ, ప్రకాశం జిల్లాల వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయాలని నాగిరెడ్డి కోరారు. రాయలసీమకు కూడా విదర్భా తరహా ప్యాకేజీ డిమాండ్‌ చేయాలని సూచించారు. ఇక్కడ కరువుతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశాన్ని ప్రస్తావించాలని డిమాండ్‌ చేశారు. గత మూడు ఖరీఫ్‌ సీజన్‌లో కూడా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల వివరాలను వెల్లడించారు. 2014–15లో రాష్ట్ర వ్యాప్తంగా 238 కరువు మండలాలను ప్రకటిస్తే అందులో రాయలసీమలోనే 155 మండలాలు ఉన్నాయని గుర్తుచేశారు. 2015–16కు గాను 355 మండలాలు ప్రకటిస్తే రాయలసీమలో 212, 2016–17కు గాను 271 మండలాలను ప్రకటిస్తే అందులో 184 మండలాలు రాయలసీమలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రికి నాగిరెడ్డి హితవు పలికారు. ఇవన్నీ ఎంపెడాలో ప్రభుత్వ ప్రకటించిన లెక్కలేనని ఆయన తెలిపారు. రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి అంతకు మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో పరిస్థితులు గమనిస్తే ప్రధాన పంటలైన వేరుసెనగ, కంది సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందని ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలేక రోడ్డుపై పడేసి పోయే పరిస్థితులు వచ్చిన విషయాన్ని గుర్తెరిగి రైతులను ఆదుకోవాలన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అములు, ధరల స్థిరీకరణ నిధులు వంటి ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. ఇన్‌పుట్‌ సబ్సిడీ పేరుతో మంత్రులు ఆడుతున్న డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఆక్వా రంగంలో 24.5 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకోవడం దారుణమన్నారు. కృష్ణా బేసిన్‌లో నీరు లేక వేల ఎకరాలు ఎండిపోతే మీరు దిగుబడి సాధించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవాలు దాచి ప్రజలను మోసం చేయడం వలన కేంద్రం నుంచి అందాల్సిన నిధులు దక్కడం లేదని వివరించారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. జీడీపీ పేరుతో రైతాంగనికి అర్థంకాని లెక్కలు చెప్పి మోసం చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు.

వైయస్‌ఆర్‌ ఉంటే 2014లోనే ప్రాజెక్టులు పూర్తయ్యేవి
మహానేత వైయస్‌ఆర్‌ బతికి ఉండి ఉండే 2014 నాటికే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన హయాంలోనే అన్ని ప్రాజెక్టులు సరాసరిన 70 నుంచి 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయ ప్రాజెక్టులతో వచ్చే లాభం ఏమీ ఉండదని చెప్పుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు తన మనసులో మాట పుస్తకం ద్వారా వ్యవసాయ ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెడితే కనీసం 10 శాతం కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. పులిచింతల, హంద్రీనీవా ప్రాజెక్టులను ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభిస్తే మళ్లీ 2004 వైయస్‌ఆర్‌ సీఎం అయ్యేవరకు ముందుకు సాగలేదని తెలిపారు. సీఎంగా ఉండగా చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో మూడో వంతు దుర్భిక్షం.. కరువు తాండవం.. అని అన్ని పత్రికలు వార్తలు రాస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం వ్యవసాయంలో వృద్ధి రేటు సాధించానని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. 5 శాతం పనులకు మూడేళ్లా బాబూ..

చంద్రబాబు కర్నూలు జిల్లాలో ప్రారంభించిన ముచ్చుమల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంను 2007 ఆగస్టు 31న దివంగత నేత వైయస్‌ఆర్‌ ప్రారంభించి 90 శాతం పనులు పూర్తిచేశారని తెలిపారు. ఐదు శాతం పనులు కిరణ్‌lకుమార్‌రెడ్డి పూర్తిచేస్తే మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు మూడేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థర్‌ కాటన్‌ దొరను పొగిడిన చంద్రబాబు ఆయనలాగే నడుచుకుని వ్యవసాయ రంగానికి వెన్నుముకలా నిలిచిన వైయస్‌ఆర్‌ పేరు తలుచుకోవాలంటే భయంగా ఉండేదన్నారు. దేశంలోనే అతిపెద్దదిగా ఉన్న గండిక్టో టర్మినల్‌తోపాటు పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనుమతులు తీసుకొచ్చిన ఘనత మహానేతకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. కాంట్రాకర్ల కోసం, లంచాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టడం శోఛనీయమన్నారు. పది వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టుకు వైయస్‌ఆర్‌ హయాంలో అన్ని అనుమతులు లభించి దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. అయితే బాబు ముఖ్యమంత్రి అయ్యాక అంచనాలు ఒక్కసారిగా పెంచేశారని ఆరోపించారు. పదివేల కోట్ల నుంచి 16 వేల కోట్లు.. అక్కడ్నుంచి 32 వేల కోట్లు ఇప్పుడు రూ. 40వేల 200 కోట్లకు చేర్చారని దుయ్యబట్టారు. అయితే కేంద్రం చేస్తున్న సాయం 16 వేల కోట్లకా లేక 40వేల కోట్లకా తేల్చి చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒకయ వ్యక్తి ఇంత దారుణంగా అబద్ధాలు ప్రచారం చేయడం రాష్ట్రానికి అంత మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై దృష్టిసారించి రైతుల కష్టాలపై ప్రధానికి లేఖ రాయాలని కోరారు.
Back to Top