ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సంతాపం

వైయస్‌ఆర్‌ జిల్లా: చింతకొమ్మదిన్నె మండలంలోని ఇప్పపెంట పంచాయతీ పరిధిలోని వెంకట్రాంపల్లెకు చెందిన వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు రాజశేఖర్‌ రెడ్డి భార్య భాగ్యమ్మ మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుకున్న కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనా«ద్‌ రెడ్డి బుధవారం మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఆయన వెంట సర్పంచ్‌ మల్లికార్జున యాదవ్, వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు రామసుబ్బారెడ్డి,నాగరాజు తదితరులు ఉన్నారు. 

Back to Top