క్షీణించిన రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం

కడప: గాలేరు-నగరి, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు, నీరు అందించాలనే డిమాండ్తో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కమాలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. వీరపునాయునిపల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో ఉన్న  ఆయనను పలువురు నేతలు పరామర్శించి వెళ్లారు.  ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవెల్స్, రక్త పీడనం మెలమెల్లగా పడిపోతున్నాయని చెప్పారు.
Back to Top