బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

వైఎస్సార్
జిల్లా: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలు,నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా
పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురంలో పర్యటించి ,
బాధితులను పరామర్శించారు. కొండాయపల్లెలో సుమారు 74 గొర్రెలను కోల్పోయిన
పెంపకందారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అదేవిధంగా మొలకవారిపల్లెలో
శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, పక్కా గృహాల మంజూరుకు ప్రతిపాదనలు
పంపాలని తహశీల్దార్ రామమోహన్‌కు సూచించారు. 

గంగవరం
గ్రామంలో వరి పైరును పరిశీలించి బాధిత రైతులతో రవీంద్రనాథ్‌రెడ్డి
మాట్లాడారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.20వేలు, గొర్రెకు రూ.10వేలు
చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను కోరారు. గత ఐదు రోజులుగా
కురుస్తున్న వర్షాలకు నష్టాల పాలైన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని
రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.  
Back to Top