దెబ్బతిన్న పంటల పరిశీలన..!

వైఎస్సార్ జిల్లా: కమలాపురం
ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో
పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. భారీ
వర్షాల కారణంగా మండలంలో వరిపంటలన్నీ నీట మునిగిపోయినట్లు రవీంద్రనాథ్
రెడ్డి తెలిపారు.  రైతులతో మాట్లాడి  పంటనష్టంపై సమాచారం సేకరించారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.

మరోవైపు
 వైఎస్సార్సీపీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు రెడ్డికాలువకు గండి
పడడంతో ...ఆ ప్రాంతాన్ని సందర్శించి త్వరతగతిన పనులు పూర్తి చేయాలని
అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ
కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి, ఇరిగేషన్ డీఈ మురళీ పర్యటించారు.
Back to Top