మృతునికి ఎమ్మెల్యే నివాళులు

కమలాపురం అర్బన్‌ః పట్టణంలోని పడమటి వీధికి చెందిన రిటైర్డ్‌ పంచాయతీ ఈవో జి. శివశంకర్‌రెడ్డి(69) గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మృతుని భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి, ఆ కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ఉత్తమారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారుజోళ్ళ శ్రీనివాసరెడ్డి, నల్లింగాయపల్లె సింగల్‌ విండో అధ్యక్షుడు రాజుపాళెం సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎన్‌.సి.పుల్లారెడ్డి, పార్టీ ట్రెజరర్‌ సుదా కొండారెడ్డి, సీనియర్‌ నాయకుడు సి.ఎస్‌.నారాయణరెడ్డి, పి.వి. కృష్ణారెడ్డి, మండల యూత్‌ నాయకుడు వల్లెల సునీల్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

Back to Top