కాలయాపన కోసమే యాత్రలు

కమలాపురం: వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం జన చైతన్య యాత్రల పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ... తెలుగుదేశం పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందని, అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ఇన్నాళ్లూ రాజధాని పేరుతో కాలయాపన చేసిన నేతలు ఇప్పుడు జన చైతన్య యాత్రల పేరుతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా ఏం ముఖం పెట్టుకొని యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు.
Back to Top