సొంతగూటికి రవికాంత్‌


విజయవాడ: గుడివాడ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచిన రవికాంత్‌ టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి దేవినేని ఉమా సమక్షంలో రవికాంత్‌ టీడీపీలో చేరారు. కాగా తనపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరించి టీడీపీలో చేర్చకున్నారని రవికాంత్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ కుట్రలు, కుతంత్రాలను ఆయన బయటపెట్టారు. కొడాలి నాని తనకు అన్నలాంటి వాడని, వైయస్‌ఆర్‌ సీపీ తనకు తండ్రిలాంటిదని చెప్పారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఇంకా ఎంతకాలం బెదిరింపులతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా రవికాంత్‌ సంఘటనలే రిపీట్‌ అవుతాయన్నారు. బెదిరింపులకు దిగే పిచ్చి కార్యక్రమాలు మాని గుడివాడలోని టీడీపీ కార్యకర్తలకు నీతులు చెప్పుకోమన్నారు. 
Back to Top