మున్సిపల్‌ ప్రతిపక్షనేత రవికాంత్‌ జన్మదిన వేడుకలు

గుడివాడ మున్సిపల్‌ ప్రతిపక్షనేత వైయస్సార్‌సీపీ నాయకులు చోరగుడి రవికాంత్‌ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఆయన అభిమానులుజన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌ కట్‌చేసారు. రవన్న యువసేన ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆయన వ్యక్తిగత కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో గుడ్‌మేన్‌పేట ఫ్రెండ్స్‌ సర్కిల్‌ యువకులు మామిళ్ల ఎలీసా, కిట్టు,కొడాలి సతీష్, ఫణి ఫణి ఫ్రండ్స్‌ సర్కిల్‌ యువకులు, జిఎల్‌ఆర్‌ యూత్‌ అధ్యక్షులు ఆకుల మణికంఠ పాల్గొన్నారు. అరవపేటలో రవన్న యూత్‌ ఆధ్వర్యంలో బాబీ కేక్‌కట్‌చేసారు. ముబారక్‌ సెంటర్‌ లోని జుజ్జవరపు పీయోపీలస్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసారు. నాగవరప్పాడులోని గంటా రమేష్‌ మనోహర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసారు. గుడివాడ మండల పరిషత్‌ కార్యాలయంలోని ఎపీపీ కలతోటి ధామస్‌ ఛాంబర్‌లో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీపీ కలతోటి ధామస్‌ వైయస్సార్‌సీపీ గుడివాడ రూరల్‌మండలపార్టీ అధ్యక్షులు మట్టా జన్‌ విక్టర్, నాయకులు సురేష్, గుండే సునీల్, బత్తుల దీలిప్‌ కుమార్, రుద్రపాటి విజయ్‌కుమార్,బొర్రాప్రసాద్, శ్యామ్, పనుగుమాటి సుబ్బారావు పాల్గొని చోరగుడి రవికాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా ధామస్‌ మాట్లాడుతూ చోరగుడి రవికాంత్‌ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపు కోవాలని కోరారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

Back to Top