జననేత సమక్షంలో పార్టీలో చేరిన రవిప్రసాద్‌

విశాఖపట్నం: అరకు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత రవిప్రసాద్‌ తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవిప్రసాద్‌ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాన్ని గతంలో దివంగత మహానే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా వైయస్‌ జగన్‌ గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతుగా పార్టీలో చేరానన్నారు. 
 
Back to Top