రావెల కిషోర్ బాబు అవివేకి

శ్రీకాకుళం : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మంత్రి రావెల కిషోర్ బాబుపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆస్తుల అటాచ్మెంట్ అనే పదానికి అర్థం తెలియకుండా మాట్లాడటం మంత్రి రావెల అవివేకానికి నిదర్శనమన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఎందుకు దేశ బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. అలాగే ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి రావెల కుమారుడిని ఎందుకు రాష్ట్ర బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. ఒకే ఎఫ్ఐఆర్పై 11 ఛార్జీషీట్లు వేయడం అంటేనే అక్రమ కేసు అని అర్థమవుతుందని తమ్మినేని సీతారాం అన్నారు.

Back to Top