రంగనాథరాజు చేరికతో జిల్లాలో పార్టీ బలోపేతం


పెదఅమిరంలో జననేత సమక్షంలో పార్టీలో చేరిన చెరుకువాడ

పశ్చిమ గోదావరి: చెరుకువాడ రంగనాథరాజు చేరికతో పార్టీ జిల్లాలో మరింత బలపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెదఅమిరంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో రంగనాథరాజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రంగరాజు అన్నను వైయస్‌ఆర్‌ సీపీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. జిల్లాలో రంగరాజు అంటే మంచి పేరుందని, ప్రజాబలం కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆయన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. 
మళ్లీ వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరడం సంతోషం.

అనంతరం రంగనాథరాజు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కుటుంబంలో ఉండాలనే నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో చేరుతున్నానన్నారు. మళ్లీ వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పాదయాత్ర ద్వారా అందరి హృదయాలను గెలుచుకుంటున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. 
 
Back to Top