రెండేళ్ల‌లో రాముడి పాలన

ఆక్వా ఫ్యాక్టరీని సముద్రంలో కలపడమా.. లేక ఒడ్డున పెట్టడమా?
వైయస్‌ జగన్‌కు 50 లక్షల మెజార్టీ వస్తుందేమోనని బాబుకు భయం
సీఎంను నమ్మి మోసపోయిన 17 మంది ఫిరాయింపుదారులు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తుందుర్రు: రాష్ట్ర ప్రజానికం రెండు సంవత్సరాల ఓపికపడితే రావణాసురుడి పాలన పోయి రాముడి పాలన వస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంజనేయస్వామి పర్వతాన్ని తీసుకెళ్లినట్లుగా ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీని సముద్రంలో కలపడమా.. లేక సముద్ర ఒడ్డున పెట్టడమో జరుగుతందని అంబటి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు చేపట్టిన దీక్షకు అంబటి సంఘీభావం తెలిపారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అధికారం శాశ్వతం అనుకుంటున్నాడని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే శాశ్వతం అని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలతో మోసపోయిన ప్రజానికం నీకు ఐదు సంవత్సరాల అధికారం కల్పించారని, అది శాశ్వతం అనుకుంటే చంద్రబాబు పొరబాటేనని సూచించారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తయ్యాని, ఈ మూడేళ్లలో బాబు ఏం ఎలగబెట్టారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కేవలం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలి, ఏ విధంగా చీలుద్దామనే దురాలోచన తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో 5 లక్షల ఓట్లతో వైయస్‌ఆర్‌ సీపీ అధికారానికి దూరమైందన్నారు. చంద్రబాబు చేస్తున్న ఆగడాలను ఎక్కడికక్కడ కడిగేస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజాధరణ విశేషంగా పెరిగిందన్నారు. ఈ సారి 5 లక్షలు కాదు... 50 లక్షల ఓట్ల మెజార్టీతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తారనే భయం చంద్రబాబు గుండెలో నిద్రపోతుందన్నారు. అందుకోసమే జైలు, కేసులు అంటూ ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. 

మీ పార్టీలో సమర్థులే లేరా బాబూ?
105 టీడీపీ ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులకు సమర్థులైన వారు ఒక్కరు కూడా లేక మా పార్టీలోంచి నలుగురిని తీసుకున్నారా చంద్రబాబూ అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గు్రరానికి పచ్చగడ్డి పెట్టినట్లుగా మంత్రి పదవులు, కోట్ల రూపాయలు ఆశచూపి చంద్రబాబు తన పార్టీలోకి లాక్కున్నాడని మండిపడ్డారు. బయటకు మాత్రం వైయస్‌ జగన్‌ అంటే గిట్టక మా పార్టీకి వచ్చారని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 మంది ఎమ్మెల్యేలలో కేవలం నలుగురికి మాత్రమే ఇస్తే మిగిలిన 17 మంది చంద్రబాబు మనల్ని నట్టేట ముంచాడని బోడున విలపిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలోకి వైయస్‌ జగన్‌ రానివ్వరు.. టీడీపీలో ఉంటేనేమో గెలిచే పరిస్థితులు లేవని గగ్గోలు పెడుతున్నారని అంబ‌టి ఎద్దేవా చేశారు.
Back to Top