ప్రభుత్వ నిరంకుశ ధోరణి మారాలి

బనగానెపల్లె: సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడం హేయనీయమని వైయస్‌ఆర్‌ సీపీ కర్నూలు జిల్లా బనగానెపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెసీ ట్రావెల్స్‌ బస్‌ ప్రమాద ఘటనపై వివరాలు ఆరాతీస్తే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వీటికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై చేరి బైఠాయించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌రెడ్డి,సేవాదళ్‌ అధ్యక్షుడు బీగాల వెంకటసుబ్బయ్య, బెలుం, చింతలాయిపల్లె  ఎంపీటీసీ సభ్యులు  శీలయ్య, జయరామకృష్ణుడు, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి,నాయకులు మల్లయ్య, హుశేని, నారాయణరెడ్డి, అమర్‌నాథ్,సుంకన్న,ఈశ్వరరెడ్డి,అందె రాము, గురుభాస్కరరెడ్డి, సుధాకరరెడ్డి, సంజీవకుమార్‌రెడ్డి,ఓబులేసు,ఎంకె నాయుడు,శేఖర్,గుర్విరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top