రంగారెడ్డిలో ఐదు లక్షల సంతకాలు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని కుట్రలతో జైలుకు పంపినా ప్రజాకోర్టులో ఆయనకు న్యాయుం జరిగి తీరుతుందని పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బెక్కరి జనార్దన్‌రెడ్డి చెప్పారు.  శంషాబాద్ రూరల్ మండలంలోని కాచారం మాజీ సర్పంచ్ కె.జగన్నాథం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని జైలుకు పంపించాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందనీ, అందువల్లే ఇతర పార్టీల్లోని నేతలు కూడా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారనీ పేర్కొన్నారు. అంతకుముందు జగన్నాథం, కృష్ణగౌడ్, అజీజ్‌ఖాన్, ప్రవీణ్‌గౌడ్, ప్రవీణ్, జంగయ్య, రాజుగౌడ్, లక్ష్మయ్యగౌడ్‌లు పార్టీలో చేరారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై రాజకీయ కక్షతో సీబీఐతో కేంద్రం ఆడిస్తున్న నాటకాన్ని రాష్ట్రపతికి తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాయని జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 5 లక్షల వుంది నుంచి సంతకాలు సేకరించనున్నామన్నారు. ఇప్పటికే 2 లక్షల సంతకాలు సేకరించామన్నారు.

Back to Top