రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన షర్మిల

కోళ్ళపడకల్(మహేశ్వరం):

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం 5 గంటలకు రంగారెడ్ది జిల్లాలో ప్రవేశించింది. మహేశ్వరం మండలం కోలపడకల్ గ్రామంలో శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమె 295 కిలోమీట్లరు నడిచారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల అక్టోబరు 18న పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అశేష ప్రజానీకం శ్రీమతి షర్మిలను తమ గ్రామంలోకి ఆహ్వానించారు. తొలుత షాద్‌నగర్ నియోజకవర్గంలోని పెంజర్ల గ్రామంలో ఆమె రచ్చబండ నిర్వహించారు. అందులో పాల్గొన్న మహిళలు తమ కష్టాలను శ్రీమతి షర్మిలకు వివరించారు.

Back to Top