కలిసి దండెత్తుదామని.. మాపై దండయాత్ర చేస్తారా

కర్నూలులో హోదా ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలు అరెస్టు
యూటర్న్‌ తీసుకున్నా.. తీరుమార్చుకోని చంద్రబాబు
కర్నూలు: ప్రత్యేక హోదా కోసం దండెత్తుదామన్న చంద్రబాబు హోదా సాధన కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై పోలీసుల చేత దండయాత్ర చేయిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నాడని విరుచుకుపడ్డారు. హోదా సాధన కోసం కర్నూలు పోస్టాఫీస్‌ వద్ద ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలను చంద్రబాబు పోలీసుల చేత బలవంతంగా అరెస్టులు చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాఫీస్‌ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్, బీవై రామయ్య, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. ట్రాఫిక్, ఆఫీస్‌లకు ఇబ్బందులు కలిగించకుండా ధర్నా చేస్తున్నా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టులు చేశారన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ సీపీ నేతలను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. 
Back to Top