బాబు వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు

కర్నూలు: డబ్బు దోచుకోవాలనే పిచ్చితో చంద్రబాబు కర్నూలులోని చెన్నంపల్లి కోటను నాశనం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఆరోపించారు. పురాతన కోటలో నిధులున్నాయని తవ్విస్తూ మళ్లీ తాంత్రిక పూజలు చేయిస్తున్నాడన్నారు. బహుశా చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని సింగపూర్‌కు వెళ్లిపోవాలని చూస్తున్నట్లుగా అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి పురాతన కట్టడాలను ఎందుకు తవ్విస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాయల పకీరు సినిమాలోలా టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తున్నారు. కోటను నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు, చెన్నంపల్లి కోటలో క్షుద్రపూజలు అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజల అభిమానం పొందలేక..ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోట తవ్వకాలపై అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు. తాంత్రిక పూజలతో వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారన్నారు. 
Back to Top