బాబుది బలుపు కాదు వాపే

కర్నూలుః నంద్యాలలో గెలిచిన టీడీపీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, అది ఎప్పటికీ వాపేనని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. అంత దమ్ముంటే ఫిరాయించిన మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని టీడీపీకి సవాల్‌ విసిరారు. నంద్యాలలో ఓటర్లను భయ పెట్టడంతోనే టీడీపీ గెలిచిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే తమ పార్టీ తప్పక గెలిచేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌ స్విప్ చేయడం..వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఇందుకోసం కార్యకర్తలు, నాయకులు డీలా పడకుండా సమరోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Back to Top