యువభేరి కోసం ర్యాలీఏలూరు: ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తలపెట్టిన యువభేరి విజయవంతం చేసేందుకు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ
తీశారు. వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలామ్ బాబు
నాయకత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదించారు. వైయస్ జగన్
నాయకత్వంలో ప్రత్యేక హోదా ను సాధిస్తామని నినాదాలు చేశారు. తద్వారా
విద్యార్థులు, యువతలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు.


Back to Top