విజయమ్మ దీక్షకు మద్దతుగా మహా ర్యాలీ

గుంటూరు 23 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టిన నిరవధిక  దీక్షకు మద్దతుగా నగరంలో శుక్రవారం భారీ సంఘీభావ ర్యాలీ  చేపట్టారు. భారీ ఎత్తున ప్రజలు శ్రీమతి విజయమ్మకు మద్దతు ప్రకటిస్తుంటడంతో రోడ్లన్నీ జన సంద్రమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటూ నిరసన చేపట్టారు. లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి  ర్యాలీ ఆరంభించారు.  శంకర్ విలాస్, ఓవర్ బ్రిడ్జి, ఏసీ కాలేజీ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్‌ మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుంది.  రోడ్లన్నీ సమైక్య నినాదం మార్మోగాయి.

Back to Top