11న విజయనగరంలో నిరుద్యోగ భృతిపై నిరసన ర్యాలీ

విజయనగరం: ఎన్నికల సమయంలో నిరుద్యోగులందరికీ రూ. 2 వేల ఇస్తానని చెప్పి నాలుగేళ్లుగా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎన్నికలు దగ్గర పడుతున్నాయని యువతను మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 వేల భృతి ఇస్తానని ప్రకటించి రూ. వెయ్యి ఇవ్వడాన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు 40 ఏళ్ల వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ దొంగ పోరాటాలు చేస్తోందని కొలగట్ల ధ్వజమెత్తారు. ఈ నెల 11వ తేదీన విజయనగరంలో నిరుద్యోగ భృతిపై నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు.
Back to Top