రాష్ట్ర‌ప‌తి తో వైఎస్ జ‌గ‌న్ భేటీ

రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ భేటీ అయ్యారు. సాంప్ర‌దాయిక విడిదిలో భాగంగా
రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ హైద‌రాబాద్ లోని బొల్లారం - రాష్ట్ర‌ప‌తి
నిలయంలో విడిది చేశారు. మ‌ర్యాద‌పూర్వకంగా వైఎస్ జ‌గ‌న్ ఆయ‌న్ని
క‌లుసుకొన్నారు. ఆయ‌న‌తో పాటు వైఎస్సార్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత
మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు పొంగులేటి
శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారు. ముఖ్య‌నేత‌లు రాష్ట్ర‌ప‌తి తో కొద్దిసేపు
భేటీ అయ్యారు. ఈ స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ ను రాష్ట్ర‌ప‌తి ఆప్యాయంగా
ప‌ల‌క‌రించారు. జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ గురించి వాక‌బు చేశారు.
సాంప్ర‌దాయిక విడిదిలో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చినందున రాష్ట్ర‌ప‌తిని వైఎస్
జ‌గ‌న్ క‌లిశార‌ని, ఇది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ అని, ఇత‌ర‌త్రా ప్రాధాన్య‌త
లేద‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
Back to Top