నవరత్నాలతోనే రాజన్న స్వర్ణయుగం

–వార్డుల్లో విస్తృతంగా కొనసాగుతున్న వైయస్సార్‌ కుటుంబం
– వైయస్‌ఆర్ కుటుంబంలో చేరటానికి ఉత్సాహాన్ని కనపరుస్తున్న ప్రజలు

జగ్గయ్యపేట అర్బన్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో రాజన్న స్వర్ణయుగం రానుందని ఆ పార్టీకి చెందిన పలువురు బూత్‌ కన్వీనర్లు పేర్కొన్నారు. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో పలు వార్డులలోని పోలింగ్‌ బూత్‌లలో కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమానులను కలుసుకుంటూ వారి సాధక బాధలను తెలుసుకున్నారు. మీకు వైయస్‌ఆర్‌ గుర్తు ఉన్నారా, వైయస్‌ పాలనలో ఏదైనా లబ్ది పొందారా, వైయస్‌ కుటుంబంలో భాగస్వాములు కావాలని ఉందా అంటూ వారిని ఆ కుటుంబంలోకి తీసుకుంటున్నారు. ప్రతి ఇంటా జగన్‌ ప్రకటించిన నవరత్నాలను వివరించి స్టిక్కర్‌ అంటించి జగన్‌కు మిస్ట్‌ కాల్‌ చేస్తున్నారు. జగన్‌ సందేశం విన్న స్థానికులు సంబరపడి పోతున్నారు. అన్న రావాలి, మా కష్టాలు తీరాలి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 27,60 వ బూత్‌ కన్వీనర్లు ముసిని రాజ్యలక్ష్మి, ఆటిపాముల వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అరాచక పాలన పట్ల ప్రజలు విసుగెత్తి పోయారని తెలిపారు. పేద,బడుగు,బలహీన వర్గాలతో పాటు రైతులకు మేలుచేసే నవరత్నాల లాంటి తొమ్మిది సంక్షేమ పథకాలను జగన్ ప్రకటించారని పేర్కొన్నారు. కావున నవరత్నాలను తెలుసుకొని వైయస్‌ కుటుంబంలో చేరాలని కోరారు. కార్యక్రమంలో బూత్‌ కన్వీనర్లు పందిరి కోటేశ్వరరావు, కలవారి నాగేశ్వరరావు,ఆనం శ్రీధర్‌రెడ్డి,పి.రోశయ్య,దాసరి శాంతిలాల్, మాజీ కౌన్సిలర్‌ కవర్తపు భూలక్ష్మి,నాయకులు సలాది సూరిబాబు,వేల్పుల ప్రసాద్,చిన్ని దుర్గారావు,గుంటుపల్లి గురుప్రసాద్,అనంత ఏడుకొండలు, ముసిని శివ, పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top