విద్యాసంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

సాలూరు:
ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న టీడీపీ సర్కారు
ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ  సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
అన్నారు.  విజయనగరం జిల్లా సాలూరులోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో
జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ మహాసభలో రాజన్న దొర మాట్లాడారు. ప్రభుత్వ
పాఠశాలలను విలీనం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని,
భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రారంభించటం లేదని
రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top