అవగాహన లేకుండా వ్యాఖ్యలు

విజయనగరం:
గత ప్రభుత్వ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారంటూ పవన్ కల్యాణ్
మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ....సాలూరు ఎమ్మెల్యే
రాజన్నదొర మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ పూర్తిగా
వ్యతిరేకమని  రాజన్నదొర తేల్చిచెప్పారు. 

బాక్సైట్
తవ్వకాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా
ప్రతినిధులు ఈఆదివారం సమావేశం అవుతున్నట్లు ప్రకటించారు. ఆదివాసీల హక్కులు
కాలరాస్తూ... బాక్సైట్ తవ్వకాలకు పాల్పడితే ప్రభుత్వానికి తగిన గుణపాఠం
తప్పదని రాజన్న దొర హెచ్చరించారు. వెంటనే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్
చేశారు.
Back to Top