పామూరులో రాజన్న క్యాంటీన్‌

ప్రకాశం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు అన్నారు. జూలై 8న వైయస్‌ఆర్‌ జయంతి సందర్భంగా పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో రాజన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రూ. 2లకే భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యాంటీన్‌ను 8వ తేదీన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిలు ప్రారంభిస్తారని చెప్పారు. 
 
Back to Top