బంగ్లాదేశ్ పంపిస్తారా లేక పాకిస్థాన్ పంపిస్తారా..?

విజయనగరంః బాక్సైట్ పై గిరిజనుల అభిప్రాయాలు సేకరించకుండా ప్రజాభిప్రాయం ఎలా సేకరిస్తారని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనుల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. గ్రామసభలు, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా బాక్సైట్ పై జీవో ఎలా జారీ చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నలు సంధించారు. 

చంద్రబాబు మీ స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిచేస్తారా అని రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలను బంగ్లాదేశ్ పంపిస్తారా, లేక పాకిస్థాన్ పంపిస్తారా అని నిలదీశారు. రాష్ట్రపతి, గవర్నర్ తప్ప...షెడ్యూల్డ్ ప్రాంతంలో కాలుమోపే హక్కు ఎవరికీ లేదని రాజన్నదొర అన్నారు. తక్షణమే జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గిరిజనుల్లో అసహనం వస్తే ఎలాగుంటుందో చవిచూడాల్సి వస్తుందని రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top