రాజధాని రైతులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు

అమరావతిః రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజధానికి భూములు ఇవ్వలేదనే నెపంతో వేధింపులకు గురిచేస్తునట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఉండవల్లిలో పంటపొలాల మధ్య హైటెన్షన్‌ విద్యుత్‌వైర్లను వేసేందుకు యత్నించిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల సహకారంతో విద్యుత్‌ వెర్లును బలవంతంగా వేయడానికి ప్రయత్నించడంతో రైతులు, అధికారుల మ«ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళలు అని కూడా లేకుండా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్‌లు చేసీ పీఎస్‌కు తరలించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పురుగుమందు తాగేందుకు యత్నించారు. ఖాళీ స్థలంలో నుంచి వైర్లు వేసుకోవాలని చెప్పుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని, బలవంతంగా తమ భూముల నుంచి వైర్లు వేస్తురన్నారన్నారు.. దీంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 
Back to Top