రైతుల శ్రేయస్సే పార్టీ ధ్యేయం

పుల్లలచెరువు:

రైతు శ్రేయస్సే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నాయకుడు, టుబాకో యూనియన్ మాజీ చైర్మన్ కట్టా శివయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల సొసైటీ పరిధిలోని ఐటీవరం, మానేపల్లి, శతకోడు, ముటుకుల, మర్రివేముల పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ హయాంలోలాగానే రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్  పాలనలోనే సాధ్యమన్నారు. సొసైటీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మెరుగైన రుణాలు, ఎరువులు అందజేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, పుల్లలచెరువు సొసైటీ అధ్యక్షుడు నారు వెంకటరెడ్డి, నాయకులు ఎలిసెల కోటేశ్వరరావు, గోగిరెడ్డి గోవిందరెడ్డి, ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, బెరైడ్డి బసిరెడ్డి, ఆవుల రామిరెడ్డి, బి.కృష్ణారావు, దూదేకుల మస్తాన్, కర్నాటి సుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top