రైతులకు స్థిరీకరణ నిధి ఏర్పాటు: షర్మిల

మామిళ్లపల్లి(పొన్నూరు):

రైతుల్ని, పేదల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చుకుతింటోందని శ్రీమతి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గుంటూరు జిల్లాలోని పొన్నూరు, వేమూరు నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా  మామిళ్ల పల్లిలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రూ. 32వేల కోట్ల విద్యుత్తు చార్జీలను రక్తం పిండైన వసూలు చేయాలనుకుంటున్నారన్నారు. నిజమైన లబ్ధిదారుల ఫించన్లు, రేషన్‌కార్డులు కూడా ఈ ప్రభుత్వం తీసేస్తుందని శ్రీమతి షర్మిల ఆరోపించారు.  వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు మాత్రమే సరఫరా చేస్తున్నారని.. రాష్ట్రంలోరైతులంతా కష్టాలపాలవుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  జగనన్న బయటకు వస్తే అన్ని సక్రమంగా జరుగుతాయని, రైతులకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని గ్రామస్థుకు భరోసా ఇచ్చారు. జగనన్న త్వరలోనే బయటకువస్తారని.. రాజన్న రాజ్యం స్థాపిస్తారని షర్మిల అన్నారు. జగనన్నను గెలిపిస్తామనీ, తమ బాగోగులు చూసుకోవాలనీ మామిళ్ళపల్లి గ్రామస్థులు శ్రీమతి షర్మిలకు విజ్ఞప్తి చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top