రైతు గోడుపట్టని ప్రభుత్వం: ఎమ్మెల్యే మేకపాటి

వింజమూరు:

రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. విద్యుత్తు కోతలతో పంటలు ఎండుతున్నాయన్నారు. 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ రైతులకు అందిస్తే తప్ప పంటలు దక్కే పరిస్థితి లేదన్నారు. సామాన్యునికి అందే స్థితిలో నిత్యావసర వస్తువుల ధరలు లేవన్నారు. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు.  గత ఏడాది సంభవించిన లైలా తుపాన్‌తో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం ఈ రోజుకు కూడా నష్టపరిహారం అందించకుండా జాప్యం చేస్తోందన్నారు. ఇటీవల నీలం తుపానుతో దెబ్బతిన్న పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదన్నారు. ఉదయగిరి ప్రాంతంలో అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

     జిల్లాలోని సహకార సంఘాల్లో పెయిడ్ సెక్రటరీలతో అధికార పార్టీ నాయకులు స్వామిమాల పేరుతో సెలవులు పెట్టించారని ఆరోపించారు. అదే సెక్రటరీల ద్వారా లాడ్జీల్లో అధికార కాంగ్రెస్, టీడీపీకి చెందినవారి ఓట్లు చేర్చుకుంటున్నారన్నారు. తద్వారా సహకార ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని చేసినా ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే శ్రీ  వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.

Back to Top