రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మంత్రులు..!

హైదరాబాద్ః భూములివ్వమని రైతులు చెబుతున్నా వినకుండా మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బలవంతపు భూ సేకరణ చేపడతామని మంత్రులు చెప్పడం... రైతులను బ్లాక్మెయిల్ చేయడమేనన్నారు. భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.  బలవంతపు భూ సేకరణకు వైఎస్సార్సీపీ పూర్తిగా  వ్యతిరేకమని పిన్నెల్లి స్పష్టం చేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Back to Top