రైతుల పక్షాన పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ..!

హైదరాబాద్ః రాజధాని ప్రాంతంలో భూసేకరణపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ భవిష్యత్‌ కార్యాచరణపై  కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో గుంటూరు జిల్లా నేతలతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాజధాని ప్రాంత రైతుల భూములు కాపాడేందుకు ఏం చేయాలి, ఎలా పోరాడాలనే అంశాలపై నేతలతో చర్చించారు.

ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరగకుండా చూడాలని, అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Back to Top