రైతుల కోసం ఎంతదాకైనా పోరాడుతాం..!

ప్రభుత్వం దౌర్జన్యాలపై సమరం..
అన్నదాతకు అండగా పోరాటం..!


రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకు శృతిమించుతుండడంతో..రైతుల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. భూసేకరణపై పచ్చసర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ అలర్ట్ అయ్యింది.  రైతులకు అండగా నిలిచేందుకు ఎంతదాకైనా పోరాడాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈమేరకు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

పగ్గాలు చేపట్టిన నాటి నుండే పచ్చసర్కార్ అక్రమాలు,దౌర్జన్యాలు మొదలయ్యాయి.  విచ్చలవిడిగా ల్యాండ్ మాఫియాకు పాల్పడుతూ రైతులను నిద్రలేకుండా చేస్తున్నారు. ఎలాంటి సంతకాలు, అంగీకారం లేకుండానే రైతుల భూములను లాక్కున్నారు. ఇంకా లాక్కుంటున్నారు. ఈవిధానాన్ని వైఎస్సార్సీపీ ముందు నుండి వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సీఆర్డీఏ వద్ద ధర్నా చేపట్టడంతో ప్రభుత్వం భూసేకరణపై వెనక్కి తగ్గింది. 


ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 85 వేల ఎకరాలు సేకరించినా పచ్చచొక్కాలకు ఇంకా భూదాహం తీరడంలేదు. రాజధాని ప్రాంతంలో రాబంధుల్లా వాలిపోయి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. భూములివ్వని రైతులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు . ఎంతగా బరితెగిస్తున్నారంటే రైతుల పంటలు తగలబెడుతూ తిరిగి బాధిత రైతులపైనే కేసులు పెట్టేంత దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారు. 

ఎప్పటికప్పుడు చంద్రబాబు అండ్ కో భూదందాపై నిలదీస్తూ రైతుల పక్షాన వైఎస్ జగన్ పోరాడుతూనే ఉన్నారు.  కేపిటల్ ఏరియాలో పలుమార్లు రైతులను కలిసి వారి గోడు తెలుసుకున్నారు. పచ్చనేతలు తగలబెట్టిన పంట పొలాలను పరామర్శించి రైతులకు అండగా నిలిచారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అసైన్డ్ భూములపైనా తెలుగుతమ్ముళ్లు కన్నేయడంతో  ...వైఎస్ జగన్  రైతులను కలిసి వారిలో ధైర్యం నింపారు. ఈక్రమంలోనే  మరోమారు వారికి మద్దతుగా నిలిచేందుకు పెద్ద ఎత్తున పోరాటానికి వైఎస్ జగన్ సన్నద్ధమవుతున్నారు.
Back to Top