రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ ఆందోళన..!

హైదరాబాద్ః  రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణలో వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద ధర్నా చేపట్టారు. రైతు సమస్యలపై 6 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ లకు అందజేసేందుకు సిద్ధమయ్యారు.  తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. 

మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి రైతుల పక్షపాతిగా ఉన్నారని...చనిపోయిన రైతులకు తక్షణమే 421 జీవో కింద రూ. లక్షన్నర సహాయం చేసేవారని ఈసందర్భంగా నేతలు గుర్తుచేశారు. పదేళ్లుగా జీవో అమలులో ఉన్నా రైతులకు న్యాయం జరగడం లేదని వాపోయారు. తక్షణమే రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించేవిధంగా జీవో సవరించడంతో పాటు ... చనిపోయిన రైతు కుటుంబాలను సీఎం పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Back to Top