వ‌చ్చే బుధ‌వారం నుంచి రైతు భ‌రోసా యాత్ర

తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో రైతు కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
 
అనంతపురం: వ‌చ్చే బుధ‌వారం నుంచి ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ అనంత‌పురం జిల్లాలో పర్య‌టించ‌నున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన  రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదో విడత యాత్ర సాగించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు అయింద‌ని  పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ వెల్ల‌డించారు. 

 ఇప్పటి వరకూ జిల్లాలో నాలుగు విడతలుగా భరోసా యాత్ర నిర్వహించి 70 రైతు కుటుంబాలను పరామర్శించారని గుర్తు చేశారు.  ఐదో విడత యాత్ర తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో సాగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఆదరవు లేక రైతులు వరుసగా ఆత్మహత్యలకు తెగిస్తున్న నేపథ్యంలో ‘నేనున్నానని’ భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ భరోసా యాత్ర చేపట్టారని తెలిపారు. 
Back to Top