వైఎస్ జగన్ రాకతో వర్షాలు

గుంటూరు(మాచర్ల): ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో మాచర్ల తడిసి ముద్దయ్యింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ తో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురియడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. వైఎస్ జగన్ మాచర్లకు వస్తున్న నేపథ్యంలోనే వర్షం కురిసిందని అంతా అనుకుంటున్నారు.

 వైఎస్ జగన్ సీఎం అయితేనే  వర్షాలు సమృద్దిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. బాబు, కరవు కవలలుగా మారడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో, ప్రజలు టీడీపీ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారు. 

Back to Top