రైల్వే జోన్ తో అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం-ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌

విశాఖ‌ప‌ట్నం) ప్ర‌త్యేక రైల్వేజోన్ ఏర్ప‌డితే నిరుద్యోగం స‌హా అనేక స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం దొర‌కుతుంద‌ని వైఎస్సార్సీపీ తిరుప‌తి ఎంపీ, మాజీ ఐఎఎస్ అధికారి వ‌ర ప్ర‌సాద్ అభిప్రాయ ప‌డ్డారు. విశాక‌ఫ‌ట్నంలో రైల్వే జోన్ కోసం పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్ నాథ్ చేస్తున్న దీక్ష శిబిరాన్ని సంద‌ర్శించి ఆయ‌న సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం విభజన హామీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారని  వరప్రసాద్ విమర్శించారు. కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని, ప్రజలు దీనిని గమనించాలని ఆయన కోరారు. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం శోచనీయం అని వరప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. 

Back to Top