రైల్వే బడ్జెట్‌లో మరోసారి అన్యాయం: మేకపాటి

న్యూఢిల్లీ, 26ఫిబ్రవరి 2013:

రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్‌పీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయింపులు కంటితుడుపుగానే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు కేటాయించకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రైళ్లు, లైన్లు ఇచ్చారంటే అందుకు తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు. కేంద్రంలో రాష్ట్రం నుంచి పదిమందికి మంత్రి పదవులుండగా ఇలాంటి ప్రాజెక్టులా వచ్చేది అన్నారు. రైల్వే బడ్జెట్‌పై మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Back to Top