రాహుల్ వ్యాఖ్య‌ల‌కు ఘాటైన జ‌వాబు

హైద‌రాబాద్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా కావాలంటూ పోరాడుతున్న‌ది
వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని వైఎస్సార్‌సీపీ స్ప‌ష్టం చేసింది. పార్టీ
సీనియ‌ర్ నాయ‌కులు, మాజీమంత్రి పార్థ‌సార‌ధి హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర
కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ
వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆయ‌న‌కు రాజ‌కీయం తెలియ‌క పోయి ఉండాలి లేదంటే
దురుద్దేశం ఏమైనా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ఇదంతా ఆయ‌న అవ‌గాహ‌నా
రాహిత్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టిదాకా వైఎస్
జ‌గ‌న్ రెండుసార్లు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిసి విన‌తి ప‌త్రాలు
అందించార‌ని గుర్తు చేశారు. మూడు నాలుగు సార్లు కేంద్ర హోంమంత్రి రాజ్
నాధ్ సింగ్ ను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ని క‌లిసి
విన్న‌వించిన‌ట్లు వివ‌రించారు. కేంద్రంలో మిత్ర‌పక్షంగా ఉన్న టీడీపీ ఈ
అంశం మీద నోరు మెద‌ప‌డ‌టం లేద‌ని పార్థ‌సార‌ధి అన్నారు. ఈ అంశం మీద చిత్త
శుద్ధి ఉంటే వెంట‌నే కేంద్రం నుంచి టీడీపీ వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు.

Back to Top