వైయస్ జగన్‌ను క‌లిసిన‌ స్వర్ణ పతక విజేత రాహుల్

నూజివీడు

: కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్ వి రాహుల్ ఆదివారం సాయంత్రం వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. క్రీడాకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రకటించారు. రాహుల్ కు పార్టీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రఘుపతి రాహుల్ కు లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.

Back to Top