దోస్త్ మేరా దోస్త్..!


హైద‌రాబాద్) తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ దౌర్బాగ్యానికి మ‌రో ఉదాహ‌ర‌ణ కాంగ్రెస్ పార్టీతో స్నేహం అనుకోవ‌చ్చు. గ‌త ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపి ఎన్ని కుట్ర‌లు చేశారో అంద‌ర‌కీ తెలుసు. మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబంపై క‌క్ష సాధించ‌టానికి అన్ని మార్గాల్ని ఉప‌యోగించుకొన్నారు. అసెంబ్లీ సాక్షిగా విప్ జారీ చేసి మ‌రీ కాంగ్రెస్ పార్టీని ఆదుకొన్న ఘ‌న‌త చంద్ర‌బాబుకి ద‌క్కుతుంది.
త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక‌టే వాద‌న వినిపించారు. లేఖ ఇచ్చేశాం, విభ‌జించండి అని ప‌ట్టు ప‌ట్టి మ‌రీ విభ‌జ‌న చేయించారు. అడ్డ గోలుగా రాష్ట్రాన్ని విభ‌జించే దాకా ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆ వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టి రాజ‌ధాని కావాలంటే ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయిలు అవ‌స‌రం అని డిమాండ్ కూడా వినిపించారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా మండిప‌డుతుంటే దీని నుంచి ఎలా త‌ప్పించుకోవాలో చంద్రబాబుకి అర్థం కావ‌టం లేదు. ఈలోగా పుష్క‌రాల్ని విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు పెట్టి ఖ్యాతి సంపాదించుకొందామంటే అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగి అపఖ్యాతి వ‌చ్చేసింది. దీంతో ఈ హ‌డావుడి నుంచి దృష్టి మ‌ళ్లించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ క‌లిసి వ‌చ్చింది. దీంతో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు మార్గం సుగ‌మ‌మం అయింది.అందుకే జ‌నం దృష్టిని రాహుల్ ప‌ర్య‌ట‌న మీద‌కు మ‌ళ్లించేందుకు చంద్ర‌బాబు అండ్ కో అంత‌టి ప్రాధాన్యం ఇచ్చారు. 
Back to Top