బాబుకు అర్చకుల ఉసురు తగులుతుంది

నంద్యాల: దేవాదాయ శాఖ ఆదాయాన్ని స్వప్రయోజనాలకు వాడుకొనే ప్రభుత్వం అర్చకులను మాత్రం రోడ్డున పడేయాలని చూస్తోందని వైయస్సార్సీపీ నేత చెరుకుచర్ల రఘురామయ్య మండిపడ్డారు  నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవుడికి నిత్యం దీప, దూప నైవేద్యాలు అందించే అర్చకుల వేతనాలను ముఖ్య మంత్రి తగ్గించాలని అనుకోవడం దౌర్భాగ్యం అన్నారు. అర్చకులు ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు.  

చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులను తీవ్రంగా అవమానిస్తోందన్నారు. బ్రాహ్మణుల తరపున పోరాడే ఐవైఆర్‌ కృష్ణారావును అవమానకరంగా పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.500కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పోరేషన్‌ను పటిష్ట పరిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామని రఘురామయ్య తెలిపారు
Back to Top